ఎన్టీఆర్ 30 విడుదల తేదీ అదేనా ?

Published on Feb 19, 2020 2:43 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇంకొద్దిసేపట్లో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ కానుంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవిందసమేత’ పెద్ద హిట్ కావడంతో తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక విడుదల తేదీ కూడా ఇదేనంటూ ప్రచారం నడుస్తోంది. 2021 ఏప్రిల్ నెలలో చిత్రం విడుదలవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజమౌళి షూటింగ్ ముగియగానే తారక్ ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారట. ఫిబ్రవరికి ముగించి, ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక చిత్రంలో కథానాయికలు, ఇతర తారాగణం ఎవరనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More