ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లే స్ఫూర్తి అంటున్న బన్ని

ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లే స్ఫూర్తి అంటున్న బన్ని

Published on Oct 8, 2015 11:38 AM IST

allu-arjun1
స్టైలిష్ స్టార్ రీల్ లైఫ్ లోనే కాకుండా అరియాల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. తన తోటి హీరోలతో బాక్స్ ఆఫీసు వద్ద ఎంత పోటీ పడినా రియల్ గా మాత్రం ఎవ్వరి సినిమా బాగున్నా మెచ్చుకునే మనస్తత్వం కలవాడు. ఇది కాకుండా ఆగిపోయిన సినిమాని పూర్తి చేయాలని ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసి రిలీజ్ దశకు తీసుకొచ్చిన ఘనత మన అల్లు అర్జున్ కే చెందింది. ఆ సినిమానే ‘రుద్రమదేవి’. గుణశేఖర్ భారీ బడ్జెట్ తో చేసిన ఈ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో సినిమా ఆపేసిన టైములో నేను చేస్తా అని ముందుకు వచ్చి బన్ని ఆ పాత్ర చేసాడు. అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అసలు లేడీ ఓరియెంటెడ్ సినిమా రుద్రమదేవిలో ఓ ముఖ్య పాత్ర మాత్రమే అయిన గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి కారణం ఏంటని అల్లు అర్జున్ ని అడిగితే ‘గుణశేఖర్ గారి దగ్గర ఉన్న రుద్రమదేవి కథ నాకు తెలుసు. ఆయన సినిమా ఆగిపోయింది నా వంతు సాయం చేసి సినిమా రిలీజ్ చెయ్యాలనే ప్రధాన లక్ష్యంతో నేనే అప్రోచ్ అయ్యి చేసాను. ఈ విషయంలో నాకు స్వర్గీయ ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లే ఆదర్శం. వాళ్ళు ఏంత పెద్ద స్టార్లు అయినా ఒక చిన్న పాత్ర నచ్చినా చేసేసేవారు. అది చిన్నదా పెద్దదా అని చూసుకునేవాళ్ళు. ఉదాహరణకి ఎన్.టి.ఆర్ 200వ సినిమా కోడలు దిద్దిన కాపురం. 200వ సినిమా కదా అని ఆయన ఎలాంటి పరిధులు పెట్టుకోకుండా దానిలో ఓ మంచి పాత్ర చేసాడు. అలాంటి వాళ్ళే చేయగా నేనెంత చెప్పండి’ అని అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు.

2డి మరియు 3డి ఫార్మాట్స్ లో ఒకేసారి తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న రుద్రమదేవి సినిమాకి ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.

తాజా వార్తలు