ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా.. !

Published on Dec 22, 2018 12:22 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ఆడియో & ట్రైలర్ లాంచ్ నిన్న హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరిగింది.

కాగా ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘హిందీ, కన్నడ, తమిళ్ మరియు ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ ఎన్టీఆర్ బయోపిక్ డబ్బింగ్ కాబోతుందని బాలయ్య వెల్లడించారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ను ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడం నందమూరి అభిమానులకు మంచి జోష్ ఇచ్చే అంశమే.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, పిబ్రవరి 7న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

సంబంధిత సమాచారం :