ఎన్టీఆర్ బయోపిక్ టిజర్ షూటింగ్ రేపే !

27th, December 2017 - 05:22:46 PM

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ కు సంభందించి ఒక వార్తా తెలిసింది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించనున్నాడు. ఈ సినిమాను ఆయనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. రేపు ఈ సినిమా కు సంభందించి టిజర్ షూట్ చెయ్యబోతున్నారు. జనవరి 18 న ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ టిజర్ విడుదల చేస్తారు.

టిజర్ కోసం బాలకృష్ణ రేపు షూట్ లో పాల్గొనబోతున్నాడు. సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. 2018లో ఈ సినిమా విడుదలకు తేజ సన్నాహాలు చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. ఈ మద్య పలు సందర్భాలలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ ను అద్భుతంగా తెరకెక్కిచబోతున్నామని తెలిపారు.