రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్!

రామ్ కి భీమ్ బర్త్ డే విషెస్!

Published on Mar 27, 2024 2:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం (RRR) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకులను, అభిమానులని అలరించారు. ఈ చిత్రం తో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు వీరిద్దరు.

నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ రామ్ చరణ్. సక్సెస్ మరియు సంతోషం తో ఈ ఏడాది సాగాలి అని కోరుకుంటున్నా అని అన్నారు. ఎన్టీఆర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ తమ తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు