ప్రముఖ గార్మెంట్స్ సంస్థ బ్రాండ్ అంబాసడర్ గా జూనియర్ ఎన్టీఆర్

Published on May 15, 2019 2:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ సమయంలో జరిగిన గాయం కారణంగా తాతాల్కిక విరామంలో ఉన్నారు. చేతికి తగిలిన గాయం కారణంగా ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం లేదు. ఐతే ఈ విరామ సమయంలో ఆయన ప్రముఖ బట్టల సంస్థ ఐన ‘ఒట్టో’ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు. చెక్స్ టీ షర్ట్ జీన్ ప్యాంటు తో రఫ్ లుక్ లో ఎన్టీఆర్ ఉన్న ఆ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ సంస్థ ఎన్టీఆర్ ని ప్రకటన కర్తగా నియమించుకున్నందుకు పెద్ద మొత్తంలోనే ముట్ట చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే నవరత్నఆయిల్, సెలెక్ట్ మొబైల్ స్టోర్స్, ఐపీల్ తెలుగు వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ చేసివున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీస్టారర్ “ఆర్.ఆర్.ఆర్” లో ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధుడు కొమరం భీం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More