‘టెంపర్’ లో సర్ప్రైజ్ లపై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్.టి.ఆర్

‘టెంపర్’ లో సర్ప్రైజ్ లపై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్.టి.ఆర్

Published on Feb 12, 2015 10:37 AM IST

ntr-temper

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బడ్జెట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం నందమూరి అభిమానులకు, సినీ ప్రేమికులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో సరికొత్త ల్లోక్ లో కనిపించి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయనున్నాడు. ఆ థ్రిల్స్ ఎలా ఉంటాయనేది ఇప్పటికే ట్రైలర్స్, పోస్టర్స్ లో కాస్త రుచి చూపించారు.

కానీ తాజాగా ఎన్.టి.ఆర్ కి సన్నిహితులైన వారు చెబుతున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ టెంపర్ లో ఆడియన్స్ ని చాలా విషయాల్లో థ్రిల్ చెయ్యనున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ట్రైలర్స్ లో ఎన్.టి.ఆర్ న్యూ లుక్, బాడీ లాంగ్వేజ్ ని మనకు చూపించింది 10% మాత్రమే అని ఇంకా థ్రిల్ అయ్యే మోమెంట్స్ చాలా ఉన్నాయని సమాచారం. ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడమే కాకుండా సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. ఎన్.టి.ఆర్ ఎంతో దురుసుగా దూసుకుపోయే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్టర్.

బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుంటే, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

తాజా వార్తలు