‘రామరాజు ఫర్ భీమ్’ కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ !

Published on Apr 3, 2020 3:00 am IST

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద కూడా జక్కన్న వీడియో రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.మరి రామరాజు ఫర్ భీమ్ పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోను ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తోందో చూడాలి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట.

అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ ను హైలైట్ చెయ్యటానికి రాజమౌళి క్రేజీగానే ప్లాన్ చేస్తున్నాడట. అన్నట్టు ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి రీసెంట్ గా బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశంలో తారక్ లుక్ రివీల్ అయింది. మరి ఆ లుక్ లోనే సినిమా మొత్తం కనిపిస్తాడా లేక వేరే వేరియేషన్స్ కూడా ఉంటాయా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More