యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో శరవేగంగా జరుగుతోంది. గోవాలోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంటర్వల్ బ్లాక్ ఎపిసోడ్ షూటింగ్ ని ఇటీవలే పూరి జగన్నాధ్ పూర్తి చేసాడు. కొద్ది రోజులుగా గోవాలోని ఒకే లొకేషన్ లో షూట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మరో లొకేషన్ కి షిఫ్ట్ కానుంది.
డిసెంబర్ కల్లా సినిమాని షూటింగ్ ని పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించనున్నాడు. ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


