ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఫ్యాన్స్

Published on Dec 10, 2019 12:01 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చిత్రీకరణ కోసం ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి విశాఖకు వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ మీడియా కంటపడటంతో ఆయన వైజాగ్ వెళుతున్నారనే వార్త అభిమానులకు తెలిసిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వైజాగ్ విమానాశ్రయానికి చేరుకుని తమ అభిమాన హీరోకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

వైజగ్లో జరగబోయే షూటింగ్లో ఎన్టీఆర్ మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో తారక్ కొమురంభీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా ఒలివియా మోరిస్ నటించనుంది. ప్రధానమైన విలన్ పాత్రల కోసం ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌సన్‌ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొత్తం 10 భాషల్లో విడుదలచేయనున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More