జై బాలయ్య అంటూ హంగామా చేసిన తారక్ !

Published on Dec 30, 2018 5:02 pm IST

అగ్ర దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ, ప్రముఖ నటుడు జగపతి బాబు సోదరుని కుమార్తె పూజ ప్రసాద్ ల వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరుగనుంది. ఈవేడుకకు టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ , ప్రభాస్ ,రామ్ చరణ్ , అఖిల్ లతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో భాగంగా జరిగిన పార్టీ లో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ హంగామా చేశాడు. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటీవల బాలకృష్ణ , ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. అరవింద సమేత విజయోత్సవ సభకు బాలయ్య ముఖ్య అతిధిగా రాగా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ కు తారక్ గెస్ట్ గా వచ్చి వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని నిరూపించారు.

సంబంధిత సమాచారం :