పీక్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సత్యదేవ్…తిమ్మరుసు ట్రైలర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్!

Published on Jul 26, 2021 6:32 pm IST


సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం తిమ్మరుసు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ పతకాల పై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా తిమ్మరుసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హీరో సత్యదేవ్ లాయర్ రామచంద్ర పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ సాయంత్రం విడుదల చేశారు. అయితే తిమ్మరుసు ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందని చెప్పాలి. ఈ సినిమా లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఎంటర్ టైన్మెంట్ పక్కా అనేలా ట్రైలర్ ను తీర్చి దిద్దారు. అయితే ఈ చిత్రం జులై 30 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. థియేటర్ల ప్రారంభం తో తిమ్మరుసు విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ట్రైలర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. సినీమా ను థియేటర్ల లో చూడండి అంటూ చెప్పుకొచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :