ఎన్టీఆర్ లుక్ రివీల్ చేసి రాజమౌళికే షాకిచ్చారు

Published on Dec 11, 2019 10:07 am IST

రాజమౌళి తన సినిమాల షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోల లుక్స్ రివీల్ కాకుండా షూటింగ్ స్పాట్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విషయంలో కూడా ఇన్నాళ్లు అలాంటి జాగ్రత్తలే పాటించారు. సినిమాను ప్రకటించి చాలా రోజులే అయినా కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ లుక్ బయటకి వదల్లేదు.

అభిమానులు తన హీరోల లుక్స్ ఎలా ఉంటాయో చూడాలని, త్వరగా రివీల్ చేయాలని ఎన్ని విధాలుగా రిక్వెస్ట్ చేసినా ఊరించి ఊరించి వదలడమే తన స్టైల్ అన్నట్టు జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఆయనకే షాకిచ్చేలా కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేసేశారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ మీద వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. నేరుగా అక్కడి లొకేషన్ నుండే రాజమౌళి కొమురంభీమ్ గెటప్లో ఉన్న తారక్ కు సీన్ నరేట్ చేస్తున్న సందర్భాన్ని ఎవరో చాటుగా మొబైల్ ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలేశారు.

ఆ వీడియోలో ఎన్టీఆర్ గెటప్ దాదాపు రివీల్ అయిపోయింది. ట్విట్టర్, టిక్ టాక్ లాంటి మాధ్యమాల్లో వీడియో బాగా వైరల్ అయిపోయింది. అది చూసిన ఫ్యాన్స్ తారక్ లుక్ బాగుందని సంబరపడుతుండగా ఇంకొందరు మాత్రం ఇలా చాటుగా లుక్ రివీల్ అవడంతో ఎగ్జైట్మెంట్ మిస్సవుతాం అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More