‘మహానాయకుడు’ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Feb 25, 2019 1:13 pm IST

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కాగా తాజా రిపోర్ట్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజులకు గానూ మహానాయకుడు కేవలం 2 కోట్లు మాత్రమే వసూళ్లు చేశాడు.

ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే డిస్టిబ్యూటర్స్ కు ఎగ్జిబ్యూటర్స్ కు బాగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ వద్ద మహానాయకుడు కనీస రెవిన్యూను రాబట్టడానికి పోరాడుతోన్నాడు. కాగా కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్ మరియు విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం :