ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మరో సారి మారిందా ?

Published on Jan 30, 2019 10:10 pm IST

లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత కథ తో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలిసిందే. అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సీజన్ లో విడుదలై మంచి రివ్యూస్ ను రాబట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడం తో ఈ మొదటి భాగం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఫలితం తో సంబంధం లేకుండా చిత్ర యూనిట్ రెండవ భాగం మహానాయకుడు షూటింగ్ లో బిజీగా వుంది.

ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదలచేస్తామని ప్రకటించారు కానీ ఇటీవల కొత్త విడుదలతేదిని ప్రకటించారు. దాని ప్రకారం ఈచిత్రం వచ్చే నెల 14న విడుదలకావాల్సి వుంది కానీ ఇప్పుడు ఆ డేట్ కి కూడా విడుదలకావడం లేదని తెలుస్తుంది. తాజాగా ఈచిత్రాన్ని ఫిబ్రవరి 22న విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ విడుదల విషయం ఫై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :