ఫ్యామిలీతో ఎన్టీఆర్ హాలీడే టైమ్!

ఫ్యామిలీతో ఎన్టీఆర్ హాలీడే టైమ్!

Published on Sep 26, 2015 6:44 PM IST

NTR-Nanaku-prematho
గత మూడు నెలలుగా తన కొత్త సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌తో బిజీబిజీగా మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లండన్‌లో మూడు నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా సాగుతూ నిన్నటితో పూర్తి అయింది. ఈ లండన్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక లండన్ షెడ్యూల్ జరిగిన మూడు నెలలూ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతోనే గడిపిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో తిరిగి హైద్రాబాద్ వచ్చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ వచ్చే నెల జరగనుండడంతో ఎన్టీఆర్ అప్పటివరకూ ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు