
చాలారోజుల నిరీక్షణ తరువాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మొదలైన ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. ఈ నెల 6న ప్రారంభంకానుండగా రెగ్యులర్ షూటింగ్ నెల మధ్యనుండి జరుగుతుంది. పూర్వ నిర్మాణాంతర కార్యక్రమాలు, ఇతరేతర కారణాల వలన చిత్ర ప్రారంభంలో జాప్యం జరిగింది.
తారక్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్ తో సిద్ధమయినట్టు తెలుస్తుంది. రేపు లండన్ బయల్దేరనున్నాడని సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం విదేశాలకు చేరుకొని లోకేషన్ల వేటలో మునిగిపోయారు. ఈ సినిమాకు నాన్నకు ప్రేమతో అనే వర్కింగ్ టైటిల్ తో నామకరణం చేసారు. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు ముఖ్యపాత్రధారులు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

