‘ఛాంపియన్’కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సపోర్ట్.. రిలీజ్ టీజర్ లాంచ్!

‘ఛాంపియన్’కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సపోర్ట్.. రిలీజ్ టీజర్ లాంచ్!

Published on Dec 24, 2025 1:00 PM IST

ఛాంపియన్

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఛాంపియన్’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యంగ్ హీరో రోషన్ మేకా లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్నారు. పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌కు చెందని పలువురు స్టార్స్ ప్రమోట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో కూడా ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు తన సపోర్ట్ అందించారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేశారు.

‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి ‘ఛాంపియన్’ వరకు నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ స్వప్న సినిమా బ్యానర్‌పై కొత్త వారికి తమ సత్తా చాటేందుకు అవకాశం ఇచ్చారని.. వారు చేసే ప్రతి చిత్రం తెలుగు సినిమా పట్ల వారి ప్రేమను, ఏదైనా కొత్తది ప్రయత్నించాలని తపనను చూపిస్తు వస్తున్నాయని.. తన పక్కన అన్ని వేళలా స్వప్న ఏ విధంగా అయితే నిలబడిందో, తాను కూడా ఆమె కోసం ఎప్పటికీ నిలబడతానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఛాంపియన్ చిత్రంతో రోషన్, అనస్వర రాజన్‌లు టాలీవుడ్‌లో తమ ముద్ర వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన ప్రదీప్ అద్వైతం ఈ మూవీతో భారీ సక్సెస్ అందుకోవాలని ఆయన కోరారు. ఛాంపియన్ రిలీజ్ టీజర్ చాలా ఫన్‌గా కట్ చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు