అల వైకుంఠపురంలో చూసిన ఎన్టీఆర్ రెస్పాన్స్ ఇదే..!

Published on Jan 12, 2020 6:00 pm IST

బన్నీ త్రివిక్రమ్ ల సంక్రాంతి మూవీ అలవైకుంఠపురంలో నేడు విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ అల వైకుంఠపురంలో చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సంక్రాంతి చిత్రమని అందరూ పొగిడేస్తున్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అల వైకుంఠపురంలో చిత్రంపై తన స్పందన తెలియజేశారు. బన్నీ అద్భుత నటన మరియు త్రివిక్రమ్ బ్రిలియంట్ రైటింగ్ అల వైకుంఠపురంలో చిత్రాన్ని మంచి చిత్రంగా మలిచింది అన్నారు. ఒక గొప్ప మూవీ చూసిన భావన కలిగింది అన్నారు. అలాగే మురళి శర్మ నటనతో పాటు సాంకేతిక నిపుణుల పనితీరుని కూడా ఆయన ప్రశంసించారు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

బన్నీ చిత్రంపై ఎన్టీఆర్ ఈ విధంగా స్పందించడం చాల కలిసొచ్చే అంశం. మొత్తానికి ఈ సంక్రాంతికి బన్నీ- త్రివిక్రమ్ ప్రేక్షకులకు ఓ పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ ఇచ్చారని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. టబు, శుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సముద్ర ఖని, జయరాం వంటి నటులు కీలక పాత్రలలో నటించారు. థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :