జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం తన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ నెల మే 20 జూనియర్ పుట్టిన రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఘనం గా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దానికి కొరకు అనేక చోట్ల అన్నదానం, రక్త దాన శిబిరాల ఏర్పాటుతో పాటు అనేక సామజిక సేవ కార్యక్రమాల నిర్వహణ కు ఏర్పాట్లు మొదలుపెట్టారు.
అనూహ్యంగా ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయం వారి ఆశలు అడియాశలు చేసింది . ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాక పోవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకను జరుపవద్దని తన అభిమానులకు పిలుపునిచ్చారంట. గత సంవత్సరం ఆగస్టు29 న నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరి కృష్ణ మరణించిన విషయం తెలిసిందే.


