చరణ్…డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా…మొదటి వీడియో ను షేర్ చేసిన ఎన్టీఆర్!

Published on Aug 9, 2021 11:46 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం షూటింగ్ ఫైనల్ కి చేరుకుంది. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ సోషల్ మీడియా ను జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఇందుకు సంబంధించిన పోస్ట్ ను అధికారిక ఆర్ ఆర్ ఆర్ మూవీ పేజ్ లో తెలపడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రం ను హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్న తర్వాత నేడు ఒక వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి సంబందించిన ఫన్ చాట్ ఉంది. చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా అంటూ జూనియర్ ఎన్టీఆర్ అడగగా, రామ్ చరణ్ బల్ల పై చేతులతో డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అయితే ఈ వీడియో కాస్త ఫన్ గా ఉండటం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :