సూపర్ స్టైలిష్ గా తారక్ గ్రాండ్ షో స్టార్ట్ అయ్యిందట.!

Published on Jul 10, 2021 1:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పలు భారీ చిత్రాల లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ కూడా అవుతున్నాడు. గతంలో కూడా ఓ సినిమా చేస్తూనే తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 1 ను అత్యంత ఆహ్లాదంగా రక్తి కట్టించాడు. దీనితో ఆ తర్వాత మళ్ళీ తారక్ ఎంట్రీ స్మాల్ స్క్రీన్ పై ఏ షోలోని జరగలేదు.

కానీ ఇప్పుడు మరో గ్రాండ్ షో తో సన్నద్ధం అవుతున్నాడు. మరో హిట్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” కి తారక్ ఆ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ గ్రాండ్ షో ను ఈరోజు నుంచే స్టార్ట్ చేసేసారట. అంతే కాకుండా ఒక సాలిడ్ సెట్ లో ఈ షూట్ ని తారక్ సూపర్ స్టైలిష్ మేకోవర్ తో స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇంకో పది రోజులు ఈ షూట్ కంటిన్యూ అవ్వనున్నట్టు టాక్. మరి ఈ గ్రాండ్ షో ఎప్పుడు నుంచి టెలికాస్ట్ అవ్వనుందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :