118 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా తారక్ ?

Published on Feb 21, 2019 7:16 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తాడని ప్రచారం జరుగుతుంది. అతి త్వరలో ఈ ఈవెంట్ డేట్ ను అలాగే చీఫ్ గెస్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం తో కెవి గుహన్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం ఫై కళ్యాణ్ రామ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :