ఎన్టీఆర్ ఎలాంటి పాట పాడట్లేదు !

Published on Feb 24, 2020 4:38 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ఓ పాట పాడబోతున్నట్లు.. అలాగే ‘మాస్టర్’ చిత్రబృందం కూడా ఎన్టీఆర్‌ తో సాంగ్ పాడించాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. మొత్తానికి ఈ వార్త గాసిప్ కే పరిమితం అయింది. ఇక ఎన్టీఆర్ లో సింగర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కొన్ని పాటలు కూడా పాడాడు. అందులో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా కూడా ఉంది.

ఇక లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్ లో విజయ్‌ హీరోగా వస్తోన్న ‘మాస్టర్‌’ సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే సినిమాలో ‘లెట్‌ మి సింగ్‌ ఎ కుట్టీ స్టోరీ’ అంటూ సాగే పాటను తమిళంలో హీరో విజయ్‌ చేత పాడించారు. దాంతో ఆ తమిళ్ సాంగ్ ట్రెండింగ్‌ లో ఉంది. ‘మాస్టర్‌’ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై మహేశ్‌ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :