యన్ టి ఆర్ ట్రైలర్ , ఆడియో విడుదల తేదీలు ఫిక్స్ !

యన్ టి ఆర్ ట్రైలర్ , ఆడియో విడుదల తేదీలు ఫిక్స్ !

Published on Dec 12, 2018 5:31 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న యన్ టి ఆర్ బయోపిక్ చిత్ర ట్రైలర్ , ఆడియో విడుదల తేదీలను ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ చిత్రం యొక్క ట్రైలర్ డిసెంబర్ 16న విడుదలకానుండగా ఆడియోని ఈనెల 21న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు లో విడుదలచేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానునుంది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈచిత్రం యొక్క విడుదల హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు