ఇక్కడ ఆట నాది కోటి మీది…రండి గెలుద్దాం – ఎన్టీఆర్

Published on Aug 6, 2021 1:32 pm IST


బుల్లితెర పై అలరించేందుకు సిద్దం అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఒక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జెమిని టీవీ యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ ఆగస్ట్ నెలలోనే ఈ కార్యక్రమం షురూ కానున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను జెమిని టీవీ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక టీచర్ ఈ షో కి వచ్చి పాతిక లక్షల రూపాయలను గెలుచుకోవడం చూపించడం జరిగింది. అయితే అందులో సగం విద్యార్థుల ఫీజు కోసం ఇస్తానని చెప్పడం తో జూనియర్ ఎన్టీఆర్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది కోటి మీది, రండి గెలుద్దామ్ అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల తో వీడియో ముగుస్తుంది. అయితే ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెర పై కనిపించనుండటం తో అభిమానులు మరొక పక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :