బుల్లితెర పై అలరించేందుకు మరొకసారి సిద్ధమైన ఎన్టీఆర్!

Published on Jul 30, 2021 3:56 pm IST

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి బుల్లితెర పై అలరించేందుకు సిద్దం అయ్యారు. అయితే మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమం తో జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం కి సంబంధించిన మరొక పోస్టర్ తాజాగా విడుదల అయింది. అయితే త్వరలో ఈ షో బుల్లితెర పై ప్రసారం కానుంది అంటూ అధికారిక ప్రకటన వెలువడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను బుల్లితెర పై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఒక పక్క సినిమాలు చేస్తూనే, జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో చేయడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ను చూడబోతుండటం పట్ల ఆసక్తి నెలకొంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మరొక కథానాయకుడు రామ్ చరణ్. అయితే ఈ చిత్రం అక్టోబర్ 13 వ తేదీన విడుదల కానుంది. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ఆగస్ట్ నుండి ప్రసారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :