ఎన్టీఆర్ ‘జై లవకుశ’ కు అరుదైన గౌరవం !

Published on Jul 22, 2018 7:02 pm IST

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో నటించిన చిత్రం ‘జై లవ కుశ’. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించి తారక్ కు నటన పరంగా మరింత పేరుని తీసుకొచ్చింది. ఇక ఈచిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బెస్ట్ అఫ్ ఆసియా క్యాటగిరీలో ప్రతిష్ఠాత్మక బుచీయోన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ అయ్యింది.

కొరియాలో జరుగనున్న ఈ ఫెస్టివల్లో ఈ చిత్రం తో పాటు ఇండియా నుండి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జింద హై’ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More