50 రోజులు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ !

9th, November 2017 - 09:23:22 AM

సెప్టెంబర్ 21న విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన సంగతే. ఈ చిత్రంతో కెరీర్లో ఒక మంచి సక్సెస్ ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ఒక మెట్టి పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.

ఈ చిత్రం నేటితో తెలుగు రాష్ట్రాల్లోని పలు సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశారు. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్ తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.