ఎన్టీఆర్ కాస్ట్లీ కారు వచ్చేసింది !

Published on Jul 24, 2021 11:39 am IST


ఎన్టీఆర్ కొన్న ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కార్ ఎన్టీఆర్ ఇంటికి చేరింది. దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట ఈ కారు. ఎన్టీఆర్ కారును కొన్నది తన తల్లి ‘షాలిని’ కోసమట. తన తల్లి కోసం ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేయించారు తారక్. ప్రతి హీరోకి లాంబోర్గిని కార్లు అంటే మహా సరదా. ఇక ప్రస్తుతం తారక్ జెమినీ టీవీ ప్రసారం చేసే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూట్ లో పాల్గొంటున్నాడు.

ఆలాగే ఆర్ఆర్ఆర్ బ్యాలెన్స్ షూట్ లో తారక్ పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ షూట్ ముగిసిన తర్వాత వెంటనే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు, ఎన్టీఆర్‌ కు జోడీగా కియారాను తీసుకోనున్నారని వార్తలు బలంగా వినిపించాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం :