‘ఎన్టీఆర్’ సెకెండ్ హీరోయిన్ ఓ గిరిజన యువతి ?

‘ఎన్టీఆర్’ సెకెండ్ హీరోయిన్ ఓ గిరిజన యువతి ?

Published on Apr 29, 2019 12:08 AM IST

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా షూటింగ్ మూడు వారాల పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ చివరలో షూటింగ్ తిరిగి ప్రారంభమంతుందని అందరూ భావించారు. కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం షూటింగ్ మొదలు అవ్వడానికి మరో 10 రోజులు పడుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. అయితే రెండో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ ను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే నిత్యా మీనన్ నటించబోతుందని సమాచారం.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు