యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నుంచి నెక్స్ట్ రానున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే 80 రోజుల లాంగ్ లండన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి వచ్చింది. ప్రస్తుతం షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం దసరా తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది. ఇదిలా ఉంటె లండన్ లో ఎన్.టి.ఆర్ చూపిన సింప్లిసిటీ టీం అందరినీ షాక్ చేసిందని డైరెక్టర్ సుకుమార్ తెలిపాడు.
నాన్నకు ప్రేమతో సినిమా మొత్తం అబ్రాడ్ కంట్రీస్ లోనే జరుగుతుంది. అందుకే కాస్ట్ ని తగ్గించడం కోసం ఎన్.టి.ఆర్ కి మాత్రమే 5 స్టార్ హోటల్ ని బుక్ చేసి మిగతా వారందరికీ ఓ చిన్న హోటల్ బుక్ చేసారట. కానీ ఎన్.టి.ఆర్ 3 రోజుల తర్వాత ఆ 5 స్టార్ హోటల్ ని వెకేట్ చేసి తన టీం ఉన్న హోటల్ లోనే ఉన్నాడట. అంతే కాకుండా హోటల్ మరియు సెట్స్ లో చాలా సింపుల్ గా, కలివిడిగా ఉంటూ టీం అందరి మనసును దోచుకున్నాడని సుకుమార్ రివీల్ చేసాడు. అంతే కాకుండా సెట్ లో తన పార్ట్ షూటింగ్ అయినా రోజంతా సెట్లోనే ఉండి తనకి ఫుల్ ఎంకరేజ్ మెంట్ ఇచ్చాడని సుకుమార్ చెప్పాడు.
ఈ నెల 24 లేదా 25న ఈ చిత్ర టీం స్పెయిన్ వెళ్లి అక్కడ కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలని కూడా షూట్ చేసి సినిమా షూట్ ని ఫినిష్ చేస్తారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


