‘ఓ బేబీ’కి నా చేత ఏదో శక్తి మాటలు రాయించింది – లక్ష్మి భూపాల్

Published on Jul 15, 2019 8:07 pm IST


డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ లో తన ప్రయాణం సాగిస్తోన్నారు ప్రముఖ మాటల రచయిత లక్ష్మి భూపాల్. దాదాపు అరవై చిత్రాలకు పైగా మాటలు రాసి.. ఇటీవలే భారీ విజయం సాధించిన ‘ఓ బేబీ’ చిత్రం వరకు ఎన్నో చిత్రాలకు మాటలు అందించి ఆ చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు లక్ష్మి భూపాల్. కాగా తాజాగా ఈ టాలెంటడ్ రైటర్ తన సినీ ప్రయాణానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

‘ఓ బేబీ’ చిత్రానికి తాను మాటలు రాసినందుకు చాలా గర్విస్తున్నానని.. ఒకవిధంగా ఈ సినిమాకు తానూ మాటలు రాయ్యలేదని.. ఎదో శక్తి నా చేత ఈ సినిమాకు మాటలు రాయించిందని ఆయన అన్నారు. అలాగే సినిమాలో డైలాగ్స్ సరిగ్గా లేకపోతే.. ఎంత గొప్ప స్టార్ డైరెక్టర్ ఉన్నా.. ఎంత పెద్ద గొప్ప స్టార్ హీరో ఉన్నా.. డైలాగ్స్ బాగాలేకపోతే ఆ సినిమా హిట్ అవ్వదని లక్ష్మి భూపాల్ అన్నారు.

లక్ష్మి భూపాల్ ఇంకా మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయిందని.. అయితే తాను అనేక పనులు చేస్తూ.. అనుకోకుండా డైలాగ్ రైటర్ గా మారానని అన్నారు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ తేజగారి సినిమా, అలాగే నందిని రెడ్డిగారిది ఒక సినిమా చేస్తున్నానని.. అదేవిధంగా ఇటీవలే ఓ సినిమాకి కథ కూడా ఇచ్చానని ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం :

More