సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో ‘ఓ ముగ్గురి క‌థ‌’

oka-muguri-katha
అంతా కొత్త నటీనటులతో ద‌యా పిక్చ‌ర్స్ ప‌తాకంపై దయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఓ ముగ్గురి కథ’. ముగ్గురు యువ‌కులు త‌మ జీవితాల‌ను ఎలా ప్రారంభించారు..? వారి జీవిత ప్ర‌యాణం ఎలా జ‌రిగింది..? అనే కథాంశంతో హైద‌రాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయిన ఈ సినిమా.. ప్రస్తుతం సెన్సార్ జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ద‌యా మాట్లాడుతూ… ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌లు ఓర్చి రూపొందించిన ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేము ఓ కొత్త ప‌ద్ద‌తిలో ముందుకు సాగుతున్నాము. ఈ సినిమా పేరుతో ఉన్న కొన్ని టీష‌ర్టుల‌ను మా వెబ్ సైట్ ద్వారా అమ్మ‌కానికి పెట్టాము. అవి అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో సినిమాకు ప‌బ్లిసిటీ చేసి విడుద‌ల చేయాల‌ని నిర్ణయించాం. మా ప్ర‌యోగానికి మంచి స్పంద‌న లభిస్తుంది, విజ‌య‌వంతం అవుతోంది. ‘ఓ ముగ్గురి క‌థ‌’ విడుద‌ల తర్వాత చిన్న సినిమా దర్శకనిర్మాతలు ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా సినిమాను విజ‌య‌వంతంగా విడుద‌ల చేసుకోవ‌చ్చు అని తెలుసుకుంటారు. మా ప్ర‌య‌త్నం చాలా మందికి మార్గ‌ద‌ర్శ‌కం అవుతుంది. అని అన్నారు.

ఈ సినిమాకు సంగీతంః సురేష్‌యువ‌న్‌, ఫోటోగ్ర‌ఫిః ఉద‌య్ గుర్రాల‌, నిర్మాత‌లుః కె.న‌రేంద‌ర్ రెడ్డి, కె.వ‌ర‌ల‌క్ష్మి, క‌థ, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ద‌య‌.(ద‌యాక‌ర్ రెడ్డి)

Exit mobile version