మొదటి రోజు రికార్డు కలక్షన్స్ ను రాబట్టిన ఒడియన్ !

Published on Dec 16, 2018 12:58 pm IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ ఇటీవల విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు కేరళ బాక్సాఫిస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అక్కడ 7.22కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మాలీవుడ్ లో బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇక ఇంతకుముందు విజయ్ నటించిన ‘సర్కార్’ మొదటి రోజు ఆక్కడ 6 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. తాజాగా ఈచిత్రం ఆ రికార్డును క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒడియన్ మొదటి రోజు 18.60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తెలుగు లోకూడా విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 85లక్షల గ్రాస్ ను రాబట్టింది.

ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈచిత్రాన్ని శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించాడు. ఇక ఇదిలావుంటే నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ సినిమా ఫై బాగా పడడంతో రెండవ రోజు ఈచిత్రం యొక్క కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని సమాచారం.

సంబంధిత సమాచారం :