బాహుబలి 2 ని క్రాస్ చేయలేకపోయిన ఒడియన్ !

బాహుబలి 2 ని క్రాస్ చేయలేకపోయిన ఒడియన్ !

Published on Dec 19, 2018 1:14 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ఒడియన్ ఇటీవల విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈచిత్రం కేరళలో భారీ స్థాయిలో విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు అత్యధికంగా 7కోట్ల వసూళ్లను రాబట్టి అక్కడ రికార్డు సృష్టించింది. అయితే డివైడ్ టాక్ ప్రభావంతో ఈ సినిమా మొదటి వారాంతం లో 15కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. దాంతో ఈ చిత్రం బాహుబలి 2 (15.8కోట్లు ) ని రికార్డు ను క్రాస్ చేయలేకపోయింది.

ఇక తెలుగు లోను విడుదలైన ఈ చిత్రానికి ఆదరణ కరువైయింది. పలితంగా మోహన్ లాల్ కెరీర్ లో ఈ చిత్రం పరాజయంగానే మిగిలిపోయేలావుంది. సీనియర్ దర్శకుడు శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు