కేరళలో మోహన్ లాల్ కు భారీ కటౌట్ !

కేరళలో మోహన్ లాల్ కు భారీ కటౌట్ !

Published on Dec 13, 2018 4:57 PM IST

కేరళ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు వున్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ఆయన ఫ్యాన్స్ ‘ఒడియన్’ విడుదల సందర్భంగాకేరళలోని త్రిసూర్ జిల్లాలో వున్న రాగం థియేటర్ వద్ద 130 ఫీట్ల తో మోహన్ లాల్ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరుకు అక్కడ ఇదే అత్యంత పొడవైన కటౌట్ కావడం విశేషం. ఇంతకుముందు ‘సర్కార్’ చిత్రం విడుదల సందర్భంగా తమిళ స్టార్ హీరో విజయ్ కి కేరళలోని కొల్లం లో 116 ఫీట్లతో భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇక అలాగే ఒడియన్ మలయాళంలోఅత్యధిక థియేటర్లలో విడుదలకానున్న మొదటి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం అక్కడ సుమారు 1000 కి పైగా స్క్రీన్ లలో విడుదలకానుంది.

భారీ బడ్జెట్ తో శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంఫై మాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రం మళయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 14న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు