మిలియన్ల వ్యూస్ దిశగా సూపర్ స్టార్ సినిమా టీజర్ !

మిలియన్ల వ్యూస్ దిశగా సూపర్ స్టార్ సినిమా టీజర్ !

Published on Dec 10, 2018 3:13 PM IST


మాలీవుడ్ సూపర్ స్టార్ ‘మోహ‌న్ లాల్‌’ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’. భారీ బడ్జెట్, అత్యుతమ సాంకేతిక విలువలతో రూపొందిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. కాగా టీజర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అప్పుడే ‘ఒడియన్’ టీజర్ వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

కాగా శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించన ఈ చిత్రంలో సూపర్ పవర్స్ కలిగిన పాత్రలో మోహన్ లాల్ నటించారు. రామ్ దగ్గుబాటి, సంపత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ‘మోహ‌న్ లాల్‌’ ప్రస్తుతం తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మోహన్ లాల్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారట. మరి ఈ సూపర్ స్టార్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్నీ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు