ఆఫ్ లైన్లో రచ్చ షురూ చేసిన తారకియన్స్.!

Published on Oct 22, 2020 8:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా తన మాస్ విట్నెస్ ఇండియన్ బాక్సాఫీస్ కు రుచి చూపేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఒకపక్క చరణ్ బేస్ వాయిస్ ఓవర్ తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ ల కోసం కామన్ ఆడియెన్స్ పిచ్చెక్కిపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ వండర్ నుంచి భీం టీజర్ ఇంకొన్ని గంటల్లో రానుండగా ఒకపక్క భీం రాకపై సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్స్ తో రచ్చ లేపుతూ..

తారక్ అభిమానులు ఆఫ్ లైన్ లో కూడా అంతకు మించిన స్థాయిలోనే రచ్చ మొదలు పెట్టేసారు. దాదాపు రెండేళ్ల పాటు నిరీక్షణకు తెర పడుతుండడంతో వారి ప్రేమను అన్ని రకాలుగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల జస్ట్ ఈ టీజర్ రిలీజ్ కే ఫ్లెక్సీలు పెట్టి సంబరాలు మొదలు పెట్టేసారు. అలాగే టీజర్ వచ్చాక కూడా కనీ వినీ ఎరుగని రికార్డులు సెట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో అవన్నీ తెలియాలి అంటే ఇంకొన్ని గంటల వరకు ఎదురు చూడక తప్పదు.

సంబంధిత సమాచారం :

More