అఫీషియల్ : విజయ్ “లియో” లో అధీరా.!

Published on Mar 11, 2023 4:00 pm IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “లియో” కోసం తెలిసిందే. మరి దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై హైప్ అంతకంతకు ఎక్కువ అవుతూ ఉండగా ఈ భారీ సినిమా సాలిడ్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుంది. మరి ఇప్పుడు అయితే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్..మోస్ట్ పవర్ ఫుల్ విలన్ అధీరా సంజయ్ దత్ అయితే జాయిన్ అయ్యినట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.

గత కొన్నాళ్ల నుంచి సంజయ్ దత్ ఈ సినిమాలో ఉన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. మరి చేస్తూ ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు. మరి ఈ వీడియో లో విజయ్ లుక్ కూడా మరింత ఆసక్తిగా కనిపించడం విశేషం. దీనితో ఈ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమా రీచ్ ని మరింత పెంచింది. ఇక ఈ సినిమాలో మిస్కిన్ త్రిష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :