అఫీషియల్ : ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో అనుష్క న్యూ మూవీ

అఫీషియల్ : ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ తో అనుష్క న్యూ మూవీ

Published on Mar 19, 2024 9:42 PM IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన అనుష్క శెట్టి ఇటీవల నవీన్ పోలిశెట్టి తో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఆ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మలయాళంలో కథనార్ మూవీ చేస్తున్న అనుష్క మరోవైపు తెలుగులో క్రిష్ జాగర్లమూడితో కూడా ఒక మూవీ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక నేడు అమెజాన్ ఈవెంట్ లో భాగంగా ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ మూవీకి ఘాటి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. పరిస్థితుల కారణంగా కలుపు వ్యాపారంలో చిక్కుకున్న సాధికారత పొందిన మహిళ కథగా ఆకట్టుకునే కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ నుండి అనుష్క ముసుగుతో నడిచి వెళుతున్న పిక్ ని రిలీజ్ చేసారు. తప్పకుండా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ అంటున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై రూపొందుతున్న ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. త్వరలో ఘాటి మూవీకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు