అఫీషియల్ : మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ అనౌన్స్ చేసిన ప్రముఖ సంస్థ

Published on Mar 9, 2023 1:53 am IST


ఇటీవల నాలుగేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న మూవీ పొరింజు మరియం జోస్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీలో జాజు జార్జ్, నైలా ఉషా, చెంబన్ వినోద్ జోస్, విజయ రాఘవన్, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు చేసారు. అయితే ఈ మూవీ యొక్క తెలుగు రైట్స్ ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు కొనుగోలు చేసారు. ఈ విషయాన్ని వారు కొద్దిసేపటి క్రితం తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించారు.

అలానే అతి త్వరలో ఈమూవీని ఒక బడా టాలీవుడ్ స్టార్ హీరోతో రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాం అని, దానికి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో మీకు తెలియచేస్తాం, నేడు హోలీ సందర్భంగా ఈ అప్ డేట్ అందిస్తున్నాము అంటూ వారు తమ పోస్ట్ లో తెలిపారు. కాగా ఈ మూవీలో అక్కినేని నాగార్జున హీరో గా నటించనుండగా ఇద్దరు యువ హీరోలు కీలక పాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :