“విక్రమ్” ఆల్ టైం రికార్డ్..ఆఫీషియల్ గా ప్రమోట్.!

Published on Jun 19, 2022 9:00 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ మరియు సూర్య లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లతో ఒక్క కమల్ కెరీర్ లోనే కాకుండా తమిళ్ సినిమా దగ్గర కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేస్తుంది.

అక్కడ ఇన్నేళ్ల పాటు ఉన్న బాహుబలి 2 రికార్డుని ఈ చిత్రం క్రాస్ చేసి ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడంతో ఆల్రెడీ మేకర్స్ ఆల్ టైం రికార్డు వేడుకలు చేస్తుండగా లేటెస్ట్ గా ప్రోమోస్ ద్వారా కూడా అధికారికంగా అనౌన్స్ చేసేసారు. దీనితో తమిళ్ లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

మరి ఈ సినిమా డెఫినెట్ గా 85 కోట్లు షేర్ ని అందుకోనుండగా ఒక్క తమిళనాడు లోనే 160 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కమల్ హాసన్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :