‘ఓ బేబీ’ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో కనిపిస్తుంది

Published on Jul 17, 2019 10:01 pm IST

ఈ నెల 5వ తేదీన విడుదలైన ‘ఓ బేబీ’ చిత్రం బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పేరుకి కొరియన్ సినిమా రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల్ని గొప్పగా ఆకట్టుకుంటోంది ఈ చిత్రం. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం కేవలం 15 రోజుల్లోనే రూ.35 కోట్ల భారీ మొత్తాన్ని అందుకోవడం విశేషం. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఈ స్థాయిలో విజయాన్ని అందుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. గతంతో పోల్చుకుంటే ఈమధ్య కాలంలో స్త్రీ పత్రాలు ప్రధానంగా రూపొందే చిత్రాల సక్సెస్ రేట్ బాగా తగ్గింది. నిర్మాతలు కూడా అలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ‘ఓ బేబీ’ చిత్రం మంచి నటీనటులు, ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా గొప్ప లాభాలను చూపించగలవని మరోసారి రుజువు చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ తరహా సినిమాలు మరిన్ని రూపొందడానికి మరింత ఆస్కారం దొరికినట్లయింది. ఓవర్సీస్లో కూడా చిత్రం మిలియన్ మార్కుకు చేరువలో ఉంది. ఇక తమ సినిమా అన్ని విధాలుగా విజయాన్ని సాధించడంతో సమంత, చిత్ర దర్శకురాలు నందినిరెడ్డి చాలా ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :