
సమాజంలో అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలపై విమర్శకుల ప్రసంశలు అందుకున్న దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. వాస్తవానికి చాలా దగ్గరగా బోల్డ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. జూలై 18న ఈ సినిమా విడుదలైన ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ నేటి(సెప్టెంబర్ 5)తో 50 రోజులను రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ కేంద్రాలలో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శింపబడింది. ప్రస్తుతం 11 కేంద్రాలలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, ప్రియాంక పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు నిర్మించారు. గతంలో ఇదే బ్యానర్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఇటువంటి విజయమే సాదించింది.