రొమాంటిక్ హీరో అక్కినేని నాగ చైతన్య – పూజ హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అన్ని చోట్ల నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందరూ నాగ చైతన్యకి మరో రొమాంటిక్ హిట్ అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ కి అందరి నుంచీ ఎక్కువగా ప్రశంశలు అందుతున్నాయి. సెకండాఫ్ కాస్త తగ్గినప్పటికీ ఓవరాల్ గా మంచి ఫీల్ గుడ్ మూవీ అని అంటున్నారు.
‘ఒక లైలా కోసం’ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఈ చిత్ర టీం హ్యాపీగా ఉంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ కూడా ఉండడం సినిమాకి ప్లస్ అయ్యింది. అలాగే అలీ ట్రాక్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమా హైలైట్స్ వన్ అఫ్ ది బెస్ట్ గా నిలిచింది.


