సమీక్ష : ఒక్కడినే – ఓల్డ్ రివెంజ్ డ్రామా

సమీక్ష : ఒక్కడినే – ఓల్డ్ రివెంజ్ డ్రామా

Published on Feb 15, 2013 8:00 AM IST
Okkadine1 విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2013
దర్శకుడు : శ్రీనివాస్ రాగా
నిర్మాత : సివీ రెడ్డి
సంగీతం : కార్తీక్
నటీనటులు : నారా రోహిత్, నిత్య మీనన్..


ఫామిలీ నేపధ్యం బాగా ఉన్న నారా రోహిత్ ఇండస్ట్రీలో ఒక్కడినే అంటూ ఎవరి సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాణం, సోలో సినిమాలతో పరవాలేదనిపించుకున్న రోహిత్ ఒక్కడినే అంటూ మూడవ సినిమాతో రెడీ అయ్యాడు. నిత్య మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే విడుదలకి సిద్ధమై ఆర్ధిక సమస్యల వల్ల ఆలస్యమై ఎట్టకేలకు ప్రేమికుల రోజు నాడు విడుదలైంది. శ్రీనివాస్ రాగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సివీ రెడ్డి నిర్మించారు. ఈ ఒక్కడినే ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

శివాజీ రావు (సాయి కుమార్) కూతురు న్యూయార్క్ నుండి ఇండియాకి వచ్చి సరదాగా గడపడానికి శైలజ (నిత్య మీనన్) విశాఖపట్నం దగ్గరలో ఉండే రామచంద్రాపురం అనే వూరికి వస్తుంది. శ్రీను మామ (నాగేంద్ర బాబు) ఇంట్లో ఉంటున్న ఆమెకి అక్కడ సూర్య (రోహిత్) పరిచయం అవుతాడు. సూర్య కుటుంబానికి శైలజ బాగా దగ్గరవుతుంది. సూర్యని శైలజ ప్రేమించిన తరువాత సూర్య గురించి, అతని కుటుంబం గురించి ఆమెకి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. సూర్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితమే చనిపోయిందని, సూర్య కూడా రెండు సంవత్సరాల క్రితమే చనిపోయారని వూరి జనం చెప్తారు. అసలు ఇంతకు ఎం జరిగింది అనేది మూల కథ.

ప్లస్ పాయింట్స్ :

నారా రోహిత్ చేసింది చిన్న పాత్ర మాత్రమే. రొటీన్ పాత్రే అయినా ఉన్నంత వరకు పర్వాలేదనిపించాడు. దర్శకుడి నుండి సహకారం సరిగా లేకపోయినా తన వంతు ప్రయత్నం బాగానే చేసాడు. నిత్య మీనన్, నాగేంద్ర బాబు కూడా పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శ్రీనివాస్ రాగా ఈ కథని ఇంగ్లీష్ సినిమాల నుండి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. గతంలో తెలుగులో వచ్చిన అతనొక్కడే సినిమా పోలికలు కూడా కనిపించాయి. సూర్య తన ఫామిలీ ఇలా ఉండేది అని నమ్మించడానికి ఫస్ట్ హాఫ్ అంతా గడిపేసాడు. తీరా చూస్తే అక్కడ అసలు అక్కడ కుటుంబమే లేకపోగా వేరే వాళ్ళని తీసుకువచ్చి అంత నాటకం ఆడించడం అవసరమా? అక్కడ నాటకం ఆడిన అందరూ ఎవరికి వారు అతిగా నటించడం కోట, సుధ రొమాంటిక్ ట్రాక్ అన్ని చిరాకు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ అంతా తీసుకుంటే హీరోకి పట్టుమని 15 నిముషాలు పాత్ర కూడా లేదు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సన్నివేశం ముందే ఊహించే విధంగా ఉంది. వీడియో గేమ్ చూపించి న్యూయార్క్ అని చూపించడం, చివర్లో చనిపోయిన వాడితో విలన్ ని చంపించడం లాంటివి నవ్వు తెప్పించాయి. వేటగాడు సినిమాలోని పుట్టింటోళ్ళు తరిమేసారు పాటని రీమిక్స్ చేయగా అది మరీ నాసిరకంగా ఉంది.

సాంకేతిక విభాగం :

ఆండ్రూ సినిమాటోగ్రఫీ గత సినిమాల స్థాయిలో లేదు. కార్తీక్ సంగీతంలో హొల హొల, హే పో పాటల వరకు బావున్నాయి. చిన్నా అందించిన రీరికార్డింగ్ అస్సలు బాగాలేదు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ పర్వాలేదు.

తీర్పు :

ఓల్డ్ రివెంజ్ డ్రామాని సహనాన్ని పరీక్షించే కథనంతో నడిపించాడు దర్శకుడు. ధియేటర్ కి వెళ్లి చూసి అంశాలు ఏమి లేవు.

123తెలుగు.కాం రేటింగ్ : ఒక్కడినే చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు
అశోక్ రెడ్డి

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు