‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్ వచ్చేసింది !

‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్ వచ్చేసింది !

Published on Nov 20, 2019 4:12 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఇప్పటికే 70% షూట్ పూర్తి చేసుకుంది. ఇక ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న హీరోయిన్ ను ప్రకటించనున్నామని చిత్రబృందం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అని పోస్ట్ చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు