‘నిహారిక, సుమంత్ అశ్విన్‌’ల “హ్యాపి వెడ్డింగ్” జులై 28 నట !

‘నిహారిక, సుమంత్ అశ్విన్‌’ల “హ్యాపి వెడ్డింగ్” జులై 28 నట !

Published on Jul 10, 2018 4:46 PM IST

happy weddding3

సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖారారు అయింది. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవ్వబోతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

ఇక ఈ చిత్రంలో పెళ్ళి ప్రాముఖ్యతను వివరించనున్నారు. ప్రధానంగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందివ్వగా తమన్ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్రా లోకేష్, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ చిత్ర విజయంపై నిహారికతో పాటు హీరో సుమంత్ అశ్విన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

తాజా వార్తలు