ఏడున్నర అడుగుల భారీ కాయుడితో తలపడనున్న మంచు హీరో

Published on Feb 26, 2020 10:18 pm IST

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఓ ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు అర్జున్ అనే ఐటీ ప్రొఫెషనల్ గా కనిపించనున్నాడు. మంచు విష్ణు పాత్ర ఆన్లైన్ మోసాలకు పాల్పడే ఇంటెలిజెంట్ హ్యాకర్ గా ఉండే అవకాశం కలదు. ఈ చిత్రం కి సంబంధించిన ఆన్ సెట్స్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది.

ఓ ఏడున్నర అడుగుల భారీ కాయుడి పక్కన మంచు విష్ణు, నవీన్ చంద్ర నిలబడి ఉన్న ఆ ఫోటో ఆసక్తిరేపుతుంది. ఆరడుగుల రెండు అంగుళాల హైట్ కలిగిన మంచు విష్ణు సైతం అతని పక్కన పొట్టిగా కనిపిస్తున్నాడు . మోసగాళ్లు సినిమాలో ఓ ఫైట్ సన్నివేశం కొరకు ఆతన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. మోసగాళ్లు చిత్రానికి జెఫరీ గీ చిన్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More